వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర - GANGAMMA JATARA CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
Tataiahgunta Gangamma Jatara Celebrations Tirupati : తిరుపతి జిల్లాలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఐదో రోజు దొరవేషాలతో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబద్దంగా నాట్యం చేస్తూ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీ వేంకటేశ్వరుని సోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాతయ్యగుంటలో వెలిసిన గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులంతా బైరాగి వేషంలో అమ్మవారికి పూజలు నిర్వహింస్తున్నారు. మెుత్తం తొమ్మిది రోజుల జాతరలో భాగంగా ఐదో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. పాలెగాళ్ల అరాచకాలను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడు కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.