గుట్టుచప్పుడు కాకుండా నెమళ్లు, తాబేళ్లు విక్రయాలు- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు - Gopalapatnam Pet zone searches - GOPALAPATNAM PET ZONE SEARCHES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 2:13 PM IST
Task Force Searches in Gopalapatnam Pet zone: అక్రమంగా వన్యప్రాణుల్ని పట్టుకుని, వాటిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపిన ఘటన ఆదివారం రాత్రి విశాఖలో చోటు చేసుకుంది. వన్యప్రాణుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గోపాలపట్నం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జీవీఎంసీ 89వ వార్డు సంతోష నగర్‌కు చెందిన పిల్లా నాగేశ్వర రావు(35) గోపాలపట్నంలో పెంపుడు జంతువుల విక్రయ దుకాణం (Pet Zone) నిర్వహిస్తున్నారు. అతని ఇంట్లో 15 నక్షత్ర తాబేళ్లు, రెండు నెమళ్లు, దుప్పి కొమ్ములు ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావటంతో దాడులు నిర్వహించారు. గాజువాక ప్రాంతానికి చెందిన గొందేశి శ్రీనివాసరావు నుంచి నక్షత తాబేళ్లను కొనుగోలు చేసినట్లు నాగేశ్వరరావు చెప్పడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న జీవుల్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. టాస్క్‌పోర్స్ ఏసీపీ ప్రసాద్, సీఐ మల్లేశ్, ఎస్సై భరత్‌కుమార్, గోపాలపట్నం ఎస్సై అప్పలనాయుడు పాల్గొన్నారు.