thumbnail

అరకులో ఈ జాలువారే తారాబు జలపాతం ఆందాలను తప్పక చూడండి - Tarabu Waterfalls Araku

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 8:17 PM IST

Tarabu Waterfalls Araku: అల్లూరి జిల్లాలోని పెద బయలు మండలంలోనే తారాబు జలపాతం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సుమారు 500 అడుగుల పైనుంచి జాలు వాడుతున్న నీటి ప్రవాహాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ఎంతో కష్టపడి తారాబు జలపాతానికి చేరుకుంటున్నారు. అయితే అక్కడ ప్రకృతి సౌందర్యం నడుమ తారాబు జలపాతాన్ని చూసి తాము పడిన శ్రమను సైతం మర్చిపోతున్నారు. 

మరోవైపు తారాబు జలపాతానికి వెళ్లేందుకు వీలుగా బూసిపుట్టు కూడలి నుంచి జలపాతానికి బీటీ రహదారి నిర్మాణాన్ని సైతం అధికారులు చేపట్టారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి జలపాతానికి వెళ్లేందుకు వీలుగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి దాదాపు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ తారాబు జలపాతానికి వెళ్తున్న పర్యాటకులు ఇకనుంచి ఎంచక్కా బీటీ రహదారిలోనే వెళ్లి జలపాతం సోయగాలను ఆస్వాదించే వీలు కలుగుతుంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.