పుట్టపర్తిలో ముగిసిన తమిళనాడు భక్తుల పర్తియాత్ర - ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన - Tamilnadu Devotes in Saibaba Temple - TAMILNADU DEVOTES IN SAIBABA TEMPLE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 12:00 PM IST
Tamilnadu Devotees Visit Puttaparthi Saibaba Temple: సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తమిళనాడు రాష్ట్ర భక్తుల పర్తి యాత్ర వైభవంగా జరిగింది. తమిళనాడులోని వివిధ జిల్లాలకు చెందిన సత్యసాయి బాబా భక్తులు, విద్యార్థులు యాత్రలో పాల్గొన్నారు. మధురమైన పాటలు ఆలపిస్తూ భక్తిని చాటుకున్నారు. వేలాది మంది తరలివచ్చి సత్యసాయి మహాసమాధి దర్శనం చేసుకున్నారు. యాత్ర ముగింపు సందర్భంగా ప్రశాంతి నిలయంలో పలు సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రేమ, ఏకత్వం, దైవత్వం అనే అంశంపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సత్యసాయి బాబా వారి ఉపన్యాసాల ఆధారంగా తొమ్మిది భక్తిరూపాలపై అందమైన నేపథ్య ప్రదర్శనను విద్యార్థులు ప్రదర్శించారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయం కూడలిలో తమిళనాడు నుంచి వచ్చిన సత్యసాయి భక్తులచే పురవీధులు నిండిపోయాయి. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన సేవలను సాయి సంస్థల ప్రతినిధులు శరవరణ్, సాయిప్రసాద్ తెలిపారు. సత్యసాయి మహా సమాధి వద్ద భక్తులు బారులు తీరి ఆయనను దర్శించుకున్నారు. రెండు రోజులు తమిళనాడు భక్తుల పర్తియాత్ర ముగిసింది. సత్యసాయి మహాసమాధి దర్శనం అనంతరం మంగళహారతితో వేడుకలు ముగిశాయి.