శ్రీరామతత్వం దేశ ప్రజల అందరి ఆత్మ- స్వామి వాసుదేవానంద సరస్వతి - Swami Vasudevananda Saraswati in ap - SWAMI VASUDEVANANDA SARASWATI IN AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 4:53 PM IST
Swami Vasudevananda Saraswati Visit to Kanakadurgamma Temple in Vijayawada : శ్రీరామతత్వం దేశ ప్రజల అందరి ఆత్మ అని అయోధ్య రామాలయ ట్రస్ట్ సభ్యుడు స్వామి వాసుదేవానంద సరస్వతి అన్నారు. రాముడు శక్తికి కేంద్రమని అందరినీ శ్రీరామ నామం ఒక్కటిగా చేస్తోందని తెలిపారు. సరిహద్దులతో కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మమే భరత భూమికి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన స్వామి వాసుదేవానంద మాట్లాడుతూ, అయోధ్య బాల రామాలయం కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం కాదని అది దేశ ప్రజలందరి దర్శనీయ ప్రదేశమని చెప్పారు. 500 ఏళ్ల ప్రజల నిరీక్షణ, పోరాటాల ఫలితంగా అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం బాలరాముని ప్రతిష్టాపన వైభవంగా జరిగాయన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను పరిరక్షించాలని కోరారు. అలాగే క్రమం తప్పకుండా దూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాలని ఆకాంక్షించారు.
ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే అందరినీ రక్షిస్తుందనే మూల సూత్రాన్ని అంతా ఆచరించాలని స్వామి వాసుదేవానంద సరస్వతి పిలుపునిచ్చారు. హైదరాబాదలో ప్రారంభమైన తన యాత్ర కన్యాకుమారి వరకు సాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నట్లు స్వామి వాసుదేవానంద తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. స్వామివారి రాక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వామి వాసుదేవానంద సరస్వతిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.