స్ఫూర్తిప్రదాత సూపర్ స్టార్ కృష్ణ - బుర్రిపాలెంలో ఘనంగా సంస్మరణ సభ - సూపర్ స్టార్ కృష్ణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 8:28 PM IST
|Updated : Feb 12, 2024, 6:38 AM IST
Super Star Krishna Samsmarana Sabha at Burripalem: 'ఆయనొక ఇండస్ట్రీ' అని సూపర్ స్టార్ కృష్ణను ఉద్దేశించి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సినీ నిర్మాత ఘట్టమనేని, ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో అదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలోని ఏపీకె కల్యాణ మండపంలో నిర్వహించి కృష్ణ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సినిమా చిత్రీకరణలో నూతన అధునిక సాంకేతిక విధానాలకు సూపర్ స్టార్ కృష్ణ ఆద్యుడన్నారు. భావి తరాలకు అవసరమైనవి అందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని మనోహర్ పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31న తాను పుట్టానని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తాము నడిపిన 'సెయింట్ పీటర్స్' బీఈడీ కళాశాలకు ఘట్టమనేని కృష్ణ సొంతింటిని ఇచ్చారన్నారు. సూపర్ స్టార్ అన్నదమ్ముల అనుబంధం తమ సోదరులిరువురికి ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. కృష్ణగారితో తమకు మంచి అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, గ్రామ ప్రజలు జోహార్ సూపర్ స్టార్ కృష్ణ నినాదాలు చేశారు. అగ్నిపర్వతం సినిమాలోని జమదగ్ని పాత్రలో ఉన్న కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.