దంపతుల మధ్య వివాదంతో ఆత్మహత్యయత్నం- చిన్నారి మృతి - విషం తాగి ఆత్మహత్యాయత్నం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 9:17 AM IST

Suicide Attempt By Poison The Children One Child Death: ఉగ్గుపాలు కలిపి బిడ్డలను కంటికి రెప్పలాగా చూసిన ఆ తల్లే చివరకు  విషం ఇచ్చి చంపేందుకు ఒడి కట్టింది. పిల్లల ఆలనా పాలన చూడాల్సిన ఆ తల్లే వారిని ఈ లోకంలో లేకుండా చేయాలనే కర్కశ హృదయంతో ఏ తల్లి చేయని అమానవీయ ఘటనకు ఒడి కట్టింది. బిడ్డలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. 

వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణరెడ్డిపురానికి చెందిన రవినాయక్, వసంత దంపతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో వసంత ఎలుకల మందు తాగి తన కుమారుడైన ఈశ్వర్‌కు తాగించింది. బాలుడు అస్వస్థకు గురి కావడంతో స్థానికులు మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా ఈశ్వర్ మృతి చెందాడు. కవల పిల్లలు ఈశ్వర్‌, ఉమేశ్వర్‌ రెండున్నర సంవత్సరాల వయసు కాగా, మరో కుమారుడు భానుప్రకాశ్‌కు 12 ఏళ్లు. మార్గమధ్యలో ఈశ్వర్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.