'సారూ బడికెళ్లాలి బస్సు నడపండి' - కలెక్టర్కు విద్యార్థుల వినతి - పాఠశాల సమయంలో బస్సులు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 3:00 PM IST
Students Request for Buses During School Hours in Nellore District : 'కలెక్టర్ సారూ బడికి పోవాలి, బస్సు నడపండి' అంటూ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పెద్దపాళెంకు చెందిన విద్యార్థులు కోరుతున్నారు. సోమవారం (మార్చి 4న) జిల్లా కలెక్టర్ని కలిసి వారి గోడు వినిపించారు. రామతీర్థంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే సకాలంలో బస్సు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపాళెం, లక్ష్మీపురం, వెంకట నారాయణపురం, రామచంద్రాపురం, వరిణి, దండిగుంట, గాదెలదిన్నె పంచాయితీల పరిధిలోని 23 గ్రామల విద్యార్ధులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటునట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఈ గ్రామాల విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే సుమారు 7 నుంచి 15 కిలో మీటర్లు దూరంలో గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత దూరం నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లితే రాత్రి వచ్చేసరికి 9 గంటలు అవుతుందని వాపోయారు. పాఠశాల సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.