శ్రీగురు శరానందజీ ఆచూకీ లభ్యం- ఎక్కడున్నారంటే? - Udasin Karshini Ashram President - UDASIN KARSHINI ASHRAM PRESIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 2:12 PM IST
Sri Udasin Karshini Ashram President: దిల్లీ సమీపంలోని మధురలో శ్రీ ఉదాసిన్ కర్షిణి ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురు శరానందజీ మహారాజ్ అనూహ్యంగా శ్రీకాళహస్తికి రావడం చర్చనీయాంశమైంది. దిల్లీలో ఉన్న ప్రముఖ హిందూ సంస్థల్లో శ్రీఉదాసిన్ కర్షిణి ఆశ్రమం ఒకటి. దీనికి వేల కోట్ల ఆస్తులున్నాయి. పీఠాధిపతి శ్రీగురు శాంతి స్థాపన కోసం బౌద్ధ గురువు దలైలామా, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన పలు సమావేశాల్లో భాగస్వాములవుతూ వస్తున్నారు. ఇటీవల ఆయన ఆశ్రమాన్ని విడిచిపెట్టి రావటంతో ఆచూకీ విషయమై దేశవ్యాప్తంగా పోలీసు నిఘా విభాగాలు దృష్టి సారించాయి.
ఈ నేపథ్యంలోనే రహస్యంగా విచారణ జరిపిన పోలీసులు శ్రీకాళహస్తి సమీపంలోని సుఖ బ్రహ్మ ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు పీఠాధిపతి ఒక్కరే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. ఏకాంతంగా గడపడానికే దిల్లీ నుంచి శ్రీగురు శరానందజీ మహారాజ్ వచ్చారని గుర్తించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఆయన రాకపై మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.