గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు- ఒడిశా సరిహద్దులో నిఘా చెక్‌పోస్ట్ - Special Measures to Control Ganja - SPECIAL MEASURES TO CONTROL GANJA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 3:50 PM IST
SP Madhava Reddy coments to Control Ganja in Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి నియంత్రణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. గురువారం పాలకొండ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒడిశా నుంచి గంజాయి రవాణా అవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వద్ద 24 గంటలు నిఘా కొనసాగేలా ప్రత్యేక చెక్ పోస్ట్ శాశ్వతంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా, పండించడం, వినియోగించడం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. దీంతోపాటు నాటు సారా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీఎస్పీ జీవి కృష్ణారావు, సీఐ ఎం చంద్రమౌళి, ఎస్సై అండ్ ప్రశాంత్ సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పనితీరు గమనించినట్లు తెలిపారు. గంజాయి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపారు.