వైసీపీ నేతల అక్రమాలు - కలెక్టర్, ఎస్పీల సహకారం: సోమిరెడ్డి - Somireddy on illegal mining - SOMIREDDY ON ILLEGAL MINING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 5:20 PM IST
Somireddy on Natural Resources Exploitation in Nellore District: నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదాపురం, సైదాపురం, పొదలకూరులో మంత్రి కాకాణి, వైసీపీ నేతల అక్రమాలకు కలెక్టర్, ఎస్పీ వంత పాడుతున్నారని ఆరోపించారు. ఏడాదిగా మైనింగ్ మాఫియాపై పోరాడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పటికే కలెక్టర్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఎస్పీపై కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. సహజ వనరుల దోపిడీపై ఆధారాలున్నాయంటూ వీడియో విడుదల చేశారు.
మార్చి 18వ తేదీన మైనింగ్ పరిశీలనకు వెళ్లామని, అక్కడ అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. సైదాపురంలో అక్రమ తవ్వకాలు జరిగితే అక్కడికి ఎవరూ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుపురు, మొగుళ్లూరులో అక్రమ మైనింగ్ చేస్తున్నా సీజ్ చేయడం లేదని అన్నారు. ఏడాదిగా పిర్యాదు చేసున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బరి తెగించి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.