గోవిందరాజు ఇంట్లోకి నాగరాజు- వంట గదిలో తిష్టవేయడంతో వణుకు - SNAKE IN KITCHEN - SNAKE IN KITCHEN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 2:46 PM IST
Snake In Kitchen In Konaseema District : సాధారణంగా వంటగదుల్లోకి ఎలుకలు, పిల్లులు, పెంపుడు కుక్కలు వెళ్తుంటాయి. కానీ కోనసీమ జిల్లాలో పాము వంట గదిలోకి చొరబడిన ఘటనలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఒక ఇంటి వంట గదిలో భారీ నాగుపాము బుసలు వినిపించడంతో కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు.
Snake Entered House in Mummidivaram : తిరుపతి గోవిందరాజు ఇంటి వద్ద వంట గదిలో బుసలు కొడుతూ నాగుపాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు ఇంటి యజమాని. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ టార్చ్ లైట్ వెలుగుతో భారీ పామును చాకచక్యంగా డబ్బాలో బంధించి జనావాసాలు లేని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో ఇంటి యజమాని గోవిందరాజు, కుటుంబ సభ్యులు సహా స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కోనసీమ జిల్లా ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో ప్రజసు భయాందోళనలకు గురవుతున్నారు.