'జగనన్నకు పైకి సామాజిక సాధికారత లోపలంతా కులోన్మాదం' - Samata Sainikdal Fires on YS Jagan - SAMATA SAINIKDAL FIRES ON YS JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 4:58 PM IST

Samata Sainikdal Fires on YS Jagan : రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల మీద మారణహోూమం జరుగుతుంటే ఆ వర్గాలకు బరోసా ఇచ్చి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి జగన్ ఏ మాత్రం మానవత్వం లేకుండా దాడులకు పాల్పడ్డ వారికి పూర్తి సహకారం అందిస్తూ, రక్షణ కల్పిస్తూ అండగా నిలిచారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ఆరోపించారు.

దాడి చేసిన వారిని ప్రోత్సహిస్తూ దాడిశెట్టి రాజా, తోట త్రిమూర్తులు, కిర్లం జగ్గిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  లాంటివారికి ఉన్నత పదవులు ఇస్తూ బడుగు, బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్  అని మండిపడ్డారు. పైకి సామాజిక సాధికారత లోపలంతా కులోన్మాదం, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేశానని డాంబికాలు పోతూప్రతీ సభలో తనను తాను మీ బిడ్డని, నాకు మీరు తప్ప ఎవరూ లేరు అని చెపుతూ  అన్యాయం చేస్తున్నారన్నారు. అధికారం లేని, నిధులు లేని, ప్రాధాన్యత లేని పనికిమాలిన పదువులు దళితులకు ఇచ్చి అత్యంత ముఖ్యమైన పదవులు మాత్రం తన సామాజిక వర్గం వారికే ఇచ్చి నిజమైన సామాజిక సాధికారతకు అర్ధం చెప్పిన ముఖ్యమంత్రి జగన్​ అని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.