LIVE: రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Anagani Satya Prasad Press Meet - ANAGANI SATYA PRASAD PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 4:15 PM IST
Anagani Satya Prasad Press Meet: మీడియా సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి తదితర అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలపై సీఎం సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. 1.45 లక్షల ఎకరాల మేర అక్రమాలు జరిగాయని ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రంలో ప్రకటించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం తరహాలోనే చాలా చోట్ల అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసినట్టే రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వీటిపై విచారణ చేయించాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో నేటి సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాల విచారణపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.