తగ్గుముఖం పట్టిన వరద - ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక గ్రామాలు - Floods in Kollur Lanka Villages
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 4:33 PM IST
Kollur Lanka Village Recovering from Flood in Bapatla District : కృష్ణానది వరదతో ముంపులోకి వెళ్లిపోయిన లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. గ్రామాల్లో నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద కారణంగా రెండు రోజులుగా కరెంటు సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు చెబుతున్నారు. ఆహారం వండుకునే పరిస్థితి లేదని ప్రభుత్వం ఇచ్చిన భోజనం ప్యాకెట్లు, తాగు నీటితో జీవించి ఉన్నామని చెబుతున్నారు.
నిన్నటితో పోల్చుకుంటే నేడు మూడు లక్షల క్యూసెక్కుల నీరు తగ్గడంతో కొంత ఉపశమనం కలిగిందని ప్రజలు తెలిపారు. ఇటువంటి విలయాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదని పలువురు తెలిపారు. పొలాలన్నీ చేతికందకుండా అయిపోయాయని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాత్రంతా కాస్త ఎత్తుగా ఉన్న ఇళ్లలో తలదాచుకున్నామని స్థానికులు తెలిపారు. కొన్ని ఇళ్లు కూలిపోయి పలువురు నిరాశ్రయిలయ్యారు. బాపట్ల జిల్లాలో లంక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు.