వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసకాండ - అమరావతి నుంచి విశాఖకు ఆర్​బీఐ - విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 8:57 AM IST

RBI Regional Office in Visakha: అమరావతి రాజధానిలో కార్యాలయం, నివాసాలకు 11 ఎకరాల భూముల్ని గత తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించినా, భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం అక్కడ కాకుండా విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి రావడమే తడవుగా అమరావతి విధ్వంసానికి తెగబడ్డ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం, ఆ ప్రాంతాన్ని చిట్టడవిలా మార్చేసింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికీ మోకాలడ్డుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మధ్యలో, రాజధాని ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నానికి తరలిపోతోంది. 

30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని అక్కడి జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఇటీవల లేఖ రాశారు. తాగునీరు, మరుగుదొడ్లు, రెండు లిప్టులు, విద్యుత్తు కనెక్షన్‌, అంతర్గత పార్కింగ్‌, ఇంటర్నెట్‌, కౌంటర్లు తదితర వసతులతో అయిదేళ్ల కాలానికి అద్దె ప్రాతిపదికన ఎంపిక చేయాలని అందులో సూచించారు. విశాఖలో అనువైన భవనాలను గుర్తించి తెలియజేస్తే, తమ బృందం పరిశీలిస్తుందని ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ రాసిన లేఖను ఉటంకించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.