'రాజధాని ఫైల్స్‌'కు యూట్యూబ్‌లో విశేష స్పందన - కొన్ని క్లిపింగ్స్​​లు తెగ వైరల్ - రాజధాని ఫైల్స్‌ మూవీ విడుదల తేదీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 9:46 AM IST

Rajadhani Files Movie Trailer Viral : తెలుగు వన్‌ ప్రొడక్షన్‌ (Telugu One Production)లో రూపొందిన రాజధాని ఫైల్స్‌ చిత్రం ట్రైలర్‌ సోమవారం సాయంత్రం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం కోటి వ్యూస్‌కు చేరువైంది. ఒక రైతుకి, భూమికి, ప్రభుత్వానికి మధ్య జరిగే సంఘటనల ఇతివృత్తంగా తెరకెక్కడంతో విశేష ఆదరణ లభించింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో చిత్రీకరణ మొదలుపెట్టిన ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈనెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్​గా మారిపోయింది. ఇందులోని కొన్ని క్లిపింగ్స్​​లు తెగ వైరల్​ అవుతున్నాయి. 

Rajdhani Files Movie Release Date : అరుణప్రదేశ్‌లో కేఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధానిని ఎలా విధ్వంసం చేసిందో, అయిరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఎలాంటి కర్కశ వైఖరిని ప్రదర్శించిందో రాజధాని ఫైల్స్‌ ట్రైలర్​లో  చూపించారు. కేఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కత్తి. నాలుగు ప్రాంతాలు, నాలుగు రాజధానులే తమ ఎజెండా అంటూ అయిరావతి విధ్వంసానికి పూనుకోవడంతో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధానీ అంతే అవసరం అంటూ నటుడు ప్రముఖ నటుడు వినోద్‌కుమార్‌ వివరిస్తారు. ప్రతి గ్రామంలో రాజధాని ఫైల్స్‌ సినిమా ట్రైలర్​లోని సన్నివేసాలు, పాత్రలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.