ఎమ్మెల్యే ద్వారంపూడికి నిరసన సెగ- మత్స్యకార మహిళ నిలదీత - Protest Against MLA Dwarampudi - PROTEST AGAINST MLA DWARAMPUDI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 9:48 AM IST
Protest Against MLA Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ ఏటిమొగలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఓ ఇంటి వద్దకు వచ్చిన ద్వారంపూడిని మత్స్యకార మహిళ నిలదీసింది. మత్స్యకార ఓట్లతో గెలిచినప్పటికీ తమకు ఎటువంటి మేలు చేయలేదని, కనీసం సంక్షేమ పథకాలు(Welfare Schemes) కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగటానికి వచ్చారని నిలదీసింది. ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా ద్వారంపూడి అనుచరులు, గన్ మెన్లు అడ్డుకున్నారు.
Fishermen JAC Fire on MLA Dwarampudi Chandrasekhar Reddy: కాగా ఎమ్మెల్యే ద్వారంపూడికి వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన అక్రమాలపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకారంతో ద్వారంపూడి సముద్రగర్భాన్ని లూటీ చేస్తున్నాడని ఏపీ ఫిషర్ మెన్ జేఏసీ ఛైర్మన్ రాజశేఖర్ ఆరోపించారు.