LIVE : ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - modi mann ki baat - MODI MANN KI BAAT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 11:10 AM IST

Updated : Jul 28, 2024, 11:32 AM IST

PM Modi Mann ki Baat Live Today : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. 2014 అక్టోబర్‌ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. గత నెల అరకు కాఫీ గురించి తన మనసులోని మాటను ప్రధాని మోదీ చెప్పారు. ఈ నెల భారత్​ టీ20 ప్రపంచకప్​ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. భారత బృందం పారిస్​ ఒలింపిక్స్​కు వెళ్లిన తరుణంలో దాని గురించి కూడా మాట్లాడారు. అలాగే అస్సాంలోని రాజసమాధులకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడంపై కూడా మన్​ కీ బాత్​లో ప్రసంగించారు.
Last Updated : Jul 28, 2024, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.