ఎన్నికలకు ముందే జగన్ ఓటమిని అంగీకరించారా ? - ETV Bharat Prathidhwani
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 9:15 PM IST
Prathidhwani: 30 ఏళ్లు నేనే సీఎం అని జగన్ హూంకరించారు. ప్రతిపక్షాలన్నీ కలిసినా వెంట్రుక కూడా పీకలేరని అహంకరించారు. 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని అతిశయించారు. మడమ తిప్పినట్టే ఇప్పుడు మాట కూడా తప్పేశారు. కుటుంబంలో కుంపట్లు పెట్టారని పాత పల్లవినే అందుకున్నారు. వైనాట్ వన్ సెవంటీ ఫైవ్ అన్న వ్యక్తి వైరాగ్యంలోకి దిగిపోయారు. తిరుగేలేదని బీరాలు పోయిన జగన్ నన్ను మీరే కాపాడుకోవాలని బేరాలకు దిగారు. వీడుకోలు సమయంలో వేడుకోళ్లు గుర్తొచ్చాయి. నియంతృత్వంలో ఆరితేరిన అభినవ నీరోచక్రవర్తికి అకస్మాత్తుగా భవిష్యత్ దర్శనం కలిగింది. ఓటమి ఖాయమనే దార్శనికతను చూపారు. ముందస్తు ఎన్నికలు ఏమో కానీ వైసీపీ ముందస్తు ఓటమి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ? ఈ పతనానికి దారితీసిన పరిణామాలేంటి ? ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్లు నేనే పాలిస్తాను అని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఎన్నికలకు ముందుగానే ఓటమిని అంగీకరించంపై మీ విశ్లేషణ ఏంటి ? ఇదీ అంశంపై నేటి ప్రతిధ్వని.