మాచర్లలో మారుతున్న పరిణామాలు- మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కనుమరుగు! - Political Heat in Macherla
🎬 Watch Now: Feature Video
Political Heat in Macherla Municipality : పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న ఏసోబు తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటునట్లు తన రాజీనామా లేఖను మున్సిపల్ అధికారులకు అందజేశారు. దీంతో ప్రస్తుతం వైస్ ఛైర్మన్గా ఉన్న పోలూరి నరసింహారావు ఛైర్మన్ అయ్యే అవకాశం ఉంది.
మాచర్ల మున్సిపాల్టీలోని 31 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విపక్ష పార్టీలు ఎవరూ నామినేషన్ వేయకుండా బెదిరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాచర్లలో టీడీపీ తరఫున జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించడంతో మున్సిపాల్టీ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. మాచర్ల మున్సిపాల్టీలో 20 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో కలిసి తమ సమ్మతిని తెలియజేశారు. మరో రెండు రోజుల్లో వారు అధికారికంగా పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.