జొన్నలు కొనేందుకు వెళ్తున్నా - పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 10 లక్షలు - హవల్గీచెక్‌పోస్ట్ వద్దనగదుపట్టివేత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 3:14 PM IST
Police Seized Rs. 10 Lakhs in Anantapur District: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 10 లక్షల నగదును పాల్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బళ్లారి జిల్లా చాగనూరుకు చెందిన వీరభద్రప్పగా గుర్తించారు. ఇతను ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీలో సబ్ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు సమీపంలోని హవల్గీ చెక్‌పోస్ట్ వద్ద సెబ్, ఎస్సైలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వీరభద్రప్ప ద్విచక్ర వాహనంలో రూ.10 లక్షలు తీసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు నిందుతుడి వాహనం తనిఖీ చేయగా నగదు పట్టుబడింది. నగదు గురించి విచారిస్తే తాను జొన్నలు కొనడం కోసం బ్యాంక్ నుంచి నగదు తీసుకుని వెళ్తున్నానని నిందితుడు తెలిపినట్టు పోలీసులు స్పష్టం చేశారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలు, సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు జప్తు చేశామని సెబ్ ఏఎస్పీ రామకృష్ణ వ్యక్తం చేశారు.