రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించిన గంజాయి లారీ - సినిమా స్టైల్​లో ఛేజ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

Police Chased and Caught the Container of Ganja: గంజాయి రవాణా చేస్తున్న ఓ కంటైనర్‌ లారీ రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి ఆ లారీని విశాఖ పోలీసులు ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి వచ్చిన కంటైనర్‌ ఒడిశాలోని గారబండ ప్రాంతంలో గంజాయి లోడింగ్‌ చేసుకుని వస్తున్నట్లు శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. పలాస సమీపంలోని నెమని నారాయణపురం జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున కంటైనర్‌ను ఆపారు. వాహనాన్ని పక్కన నిలపాలని డ్రైవర్‌కు చెప్పారు. అతడు తప్పించుకోవడానికి ఒక్కసారిగా కంటైనర్‌ను ముందుకు ఉరికించి మలుపు తిప్పడంతో పక్కనే ఉన్న సిబ్బంది తుళ్లిపోయి పడిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. కంటైనర్‌ తప్పించుకున్న సమాచారం అందుకున్న విశాఖ ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద వాహనం కోసం మాటు వేశారు. అక్కడా ఈ కంటైనర్‌ ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని వదిలేసి డ్రైవర్‌, సహాయకుడు పరారయ్యారు. కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆనందపురం స్టేషన్‌కు తరలించారు. గంజాయిని సీజ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.