ఆటోలో ఆరు లక్షలు విలువ చేసే మద్యం తరలింపు-ఎస్​ఈబీ అధికారులకు చిక్కిన డ్రైవర్​ - illegal liquor - ILLEGAL LIQUOR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 4:19 PM IST

Police Caught Illegal Liquor Transportation Jaggayapeta in NTR Distirct : ఎన్టీఆర్ జిల్లాలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యంను జగ్గయ్యపేట పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి ఎన్టీఆర్​ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు 100 పెట్టెల మద్యం సీసాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీస్​ అధికారులు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఆటోను, డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆటోను కిరాయికి తీసుకొని 100 పెట్టెల మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తి తరలిస్తున్నట్లు జగ్గయ్య పేట పోలీసులు తెలిపారు. వారి గురించిన పూర్తి సమాచారం ఆటో డ్రైవర్​ కూడా తెలియదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలియజేశారు. ఎన్నికల కోడ్​ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జగ్గయ్యపేట పోలీసు స్టేషన్​ పరిధిలో 76 మద్యం కేసులు నమోదు అయ్యినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందులో 91 మంది పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పోలీసుల బృందాన్ని ఆయన అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.