తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలింపు- 3,840 బాటిళ్లు స్వాధీనం - Illegal Liquor Transportation - ILLEGAL LIQUOR TRANSPORTATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 5:07 PM IST

Police Caught Illegal Liquor Transportation: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వి. అన్నవరంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సుమారు 3,840 మద్యం బాటిళ్లను సీజ్ చేశారని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో ఉన్న మద్యం షాపులో బాటిళ్లను కొనుగోలు చేసి వాటిని ఎన్టీఆర్​ జిల్లా చిలుకూరు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Police Arrest The Two People : మద్యం అక్రమంగా తీసుకురమ్మని చెప్పిన లగడపాటి శీను, మద్యం దుకాణం యజమాని పరమేశ్వరరావుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు రవికిరణ్ వెల్లడించారు. ఎన్నికల సమయం కావడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం అక్రమంగా తరలిస్తుంటారనే అనుమానంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.