దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్ - 47 లక్షలు విలువ చేసే ఆభరణాలు స్వాధీనం - tirupathi Police Arrested Two Thief
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 5:59 PM IST
Police Arrested Two Thiefs In Robbery Case: తిరుపతి పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 47 లక్షల రూపాయలు విలువ చేసే 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి ఆభరణాలు, 4 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తిరుపతి పోలీసులు వెల్లడించారు.
Police Handovered 47 Lakh Rupees Valued Things: ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులు చోరీ చేస్తూ, వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వీరిపై 14 పైగా చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు నమోదయినట్లు ఎస్పీ వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నిందితులు క్రాంతి కుమార్, జ్ఞానేష్ కుమార్లను రిమాండ్కు తరలించామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.