పాస్పోర్ట్ సర్వర్ డౌన్ - విజయవాడ కేంద్రంలో అంతరాయం - Passport server down - PASSPORT SERVER DOWN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-03-2024/640-480-21039253-thumbnail-16x9-passport-server-down.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 4:45 PM IST
Passport Server Down : విజయవాడ పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో అంతరాయం కలగడంతో వినియోగదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం 600 దరఖాస్తులకు అవకాశం ఉన్న ఈ కేంద్రంలో దాదాపు గంటన్నర పాటు సేవల్లో సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయని అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సమస్యపై వినియోగదారులు ఆందోళకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రాతీయ అధికారి వెల్లడించారు.
విజయవాడ పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో అంతరాయం కలిగింది. సుమారు గంటన్నర పాటు సేవలను నిలుపుదల చేయాల్సి వచ్చింది. సాంకేతిక కారణాలతో సర్వర్ పని చేయలేదని పాస్ పోర్ట్ అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిపారు. ప్రస్తుతం సేవలను పునరుద్ధరించనున్నారు. విజయవాడ పాస్ పోర్టు సేవా కేంద్రంలో రోజుకు 550 నుంచి 600 స్లాట్లు ఇస్తున్నారు. సాంకేతిక లోపంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. సాధ్యమైనంత వరకు ఈరోజు స్లాట్లు పూర్తి చేస్తామని పాస్ట్ పోర్ట్ ప్రాంతీయ అధికారి తెలిపారు. మిగిలిన వారికి మరో రోజు స్లాట్లు ఇచ్చి పూర్తి చేస్తామని అభ్యర్ధులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.