సైకిల్‌పై వెళ్తుండగా తగిలిన విద్యుత్ తీగలు - విద్యార్థి మృతి - మరొకరికి తీవ్ర గాయాలు - student Died Due to Current Shock - STUDENT DIED DUE TO CURRENT SHOCK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 21, 2024, 4:38 PM IST
|Updated : Aug 21, 2024, 4:48 PM IST
Student Died Due to Current Shock in Kadapa District : రాష్ట్రంలో కరెంట్ తీగలు యమ పాశాలుగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలు ఎంత చెప్పినా వారి తీరు మారడం లేదు. తాజాగా ఇటువంటి ఘటన జరిగి ఓ విద్యార్థి విగతజీవయ్యాడు. సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడపలో జరిగింది.
నగరంలోని అగాడి వీధిలో ఇద్దరు విద్యార్థులు సైకిల్‌పై బడికి వెళ్తుండగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా కింద పడిపోయారు. అక్కడే వారి శరీరం పైన మంటలు కూడా చెలరేగాయి. స్థానికులు గమనించి విద్యుత్ తీగను తొలగించినప్పటికీ తన్వీర్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన మరో విద్యార్థిని స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.
విద్యార్థి మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదంలో మరణించిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.