LIVE :నాగార్జునసాగర్ రేడియల్ క్రస్టు గేట్లు ఎత్తివేత - ప్రత్యక్ష ప్రసారం - NAGARJUNA SAGAR WATER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 10:19 AM IST
|Updated : Aug 5, 2024, 11:27 AM IST
Nagarjuna Sagar Water Release Live : నాగార్జునసాగర్ గేట్లు ఇవాళ తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటలకు డ్యామ్ అధికారులు రేడియల్ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో నాగర్జునసాగర్ నిండుకుండలా మారింది. గతేడాది నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన నాగర్జున్నసాగర్, ఈసారీ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి ప్రవాహం కొనసాగుతోంది. వస్తున్న వరద ఇన్‌ఫ్లో 4,41,183 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 40,516 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా, ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 284.16 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి నీటివిడుదలపై దిగువ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈసంవత్సరం రెండు పంటలకు ఇకా ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Aug 5, 2024, 11:27 AM IST