అధికారుల నిర్లక్ష్యంతో గాలిలో దీపంలా ఉద్యోగుల ఓట్లు - Negligence in postal ballot voting - NEGLIGENCE IN POSTAL BALLOT VOTING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 9:27 PM IST
Negligence in postal ballot voting: పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఎన్నికల విధులలో పాల్గొనే పీఓ, ఏపీఓ, ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేశారు. మొత్తం 1219 మంది తమ ఓట్లు నమోదు చేశారు.
ఓటు ప్రక్రియ నమోదు పూర్తయిన అనంతరం అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్‌ను ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు తమ ఓటును అందులో నమోదు చేశారు. ఓట్ల ప్రక్రియ ముగిసిన అనంతంర ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించారు. ఇదే అంశంపై టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేత వర్ల రామయ్య ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల తప్పిదం వల్ల 1219 మంది ఉద్యోగులు వేసిన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఘటనపై విచారణ జరిపి ఉద్యోగుల ఓట్లను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.