మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన ఎన్ఎస్యూఐ నాయకులు - అరెస్ట్ చేసిన పోలీసులు - NSUI leaders Protest dsc issue
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 1:37 PM IST
NSUI Leaders Protest the House of Minister Buggana Rajendra Prasad in Nandyala District : దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ నంద్యాల జిల్లాలో ఎన్ఎస్యూఐ (NSUI - National Students Union of India) నాయకులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన ఎస్ఎస్యూఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్యూఐ నాయకులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే సీఐ ప్రవీణ్ కుమార్ కింద పడిపోయారు.
మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌కు ఆందోళనకారులు వినతిపత్రం ఇవ్వకుండానే పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేసి మెగా డీఎస్సీని విడుదల చేయలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం జగన్ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎక్కడా అని నిలదీశారు.