కూటమి గెలుపు ఎంతో అవసరం - చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యం: టీడీపీ ఎన్నారైలు - NRITDP NRISE AP CAMPAIGN - NRITDP NRISE AP CAMPAIGN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 7:20 PM IST
NRI TDP NRISE Election Campaign in AP : 'ఎన్‌రైజ్ ఏపీ పేరిట' ఎన్నారై ఆధ్వర్యంలో ఎన్నికల క్యాంపెయిన్ ప్రోగాం నిర్వహిస్తున్నామని టీడీపీ ఎన్నారై నాయకులు తెలిపారు. ఎన్‌రైజ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఓటర్లలో చైతన్యం కలిగించడమే అని పేర్కొన్నారు. కూటమి గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణతో కూడిన లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నారై నాయకులు హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమంతో కూడిన పాలన కోసం చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలనే అనే ఒక్క నినాదంతో ఎన్ఆర్ఐలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నా ఎన్ఆర్ఐలు అందరూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్‌రైజ్ క్యాంపెయిన్‌లో భాగంగా 4 టీంలు విడిపోయి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ టీంలు రోజు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడమే తమ ఉద్దేశమని వ్యాఖ్యానించారు.