వాలంటీర్ల ద్వారా అధికార పార్టీకి లబ్ధి- వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి : నిమ్మగడ్డ రమేశ్ - Nimmagadda Ramesh - NIMMAGADDA RAMESH
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 5:09 PM IST
Nimmagadda Ramesh Commemt on Volunteers Election Campaign : వాలంటీర్లకు అధికార పార్టీతో అపవిత్ర బంధం ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు-అవినీతికి అడ్డుకట్ట అంశంపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హాజరై మాట్లాడారు. వాలంటీర్ల ద్వారా అధికార పార్టీ లబ్ధిపొందాలని చూస్తోందని నిమ్మగడ్డ అన్నారు. వాలంటీర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు.
సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో వాలంటీర్ల అవ్వతాతలతో ఓటు వేయించాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ గుర్తు చేశారు. వైసీపీ సీనియర్ మంత్రి సివిల్ సర్వీస్ నిబంధనలు వాలంటీర్ల వర్తించవు, వారు ఎలక్షన్ ఏజెంట్లుగా కూర్చొవచ్చునని పేర్కొన్న విషయాన్ని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశించినట్లు తెలిపారు. సీఎస్ కంటి తుడుపు చర్యగా ఓ మెమోను జారీ చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది వాలంటీర్లును మాత్రమే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు.