సమష్టి కృషి విజయమిది- ఎన్డీయే నేతల ఆత్మీయ సమ్మేలనం - Alliance Meeting At Nellore - ALLIANCE MEETING AT NELLORE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 7:22 PM IST
Alliance Meeting At Nellore : టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే తాము ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలవగలిగామని వేమిరెడ్డి దంపతులు అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో ప్రజా ప్రతినిధులైన తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కనుపర్తిపాడు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల రాకతో వీపీఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. వేదికపై టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన వారి రుణం తప్పకుండా తీర్చుకుంటామన్నారు. అబద్ధాలు చెప్పడం తనకు రాదని, తనకు తెలిసిందల్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమేనన్నారు. ఎన్నికల సందర్భంగా తాను చేసిన వాగ్దానాలు ఎలా నెరవేర్చాలా అని నిరంతరం ఆలోచిస్తున్నట్టు తెలిపారు.