LIVE: యువగళంతో నారా లోకేశ్ ఎన్నికల సమరభేరి - నంద్యాల నుంచి ప్రత్యక్షప్రసారం - Nara Lokesh Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 6:01 PM IST

Updated : May 3, 2024, 7:18 PM IST

thumbnail

Nara Lokesh Yuvagalam Election Campaign Live: ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశామన్న ఆయన 20 లక్షల ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చారు. నాడు ఒక్క అవకాశం అని జగన్​ మాయలో పడటంతో నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. టీడీపీ తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించి నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాండేజ్ బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని జగన్‌ పై మండిపడ్డారు. జగన్‌ ముఖంపై జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అయ్యిందని ఎద్దేవా చేశారు. కాగా ప్రస్తుతం నంద్యాలలో యువగళంతో నారా లోకేశ్ ఎన్నికల సమరభేరి ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : May 3, 2024, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.