LIVE: పోలవరంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం - ప్రత్యక్షప్రసారం - CBN White Paper on Polavaram - CBN WHITE PAPER ON POLAVARAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 3:04 PM IST
|Updated : Jun 28, 2024, 4:19 PM IST
Chandrababu White Paper on Polavaram Live : ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని దుయ్యబట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని చంద్రబాబు విమర్శించారు. డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని, రూ. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని చంద్రబాబు తెలిపారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదని తెలిపారు. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని, అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. మరోవైపు 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటిగా గత ప్రభుత్వ విధానాల వల్ల పోలవరంపై జరిగిన విధ్వసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలుపుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Jun 28, 2024, 4:19 PM IST