బాధితుడికి అండగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి- అధికారులకు ఆదేశాలతో పింఛన్ - NALLAMILLI RAMAKRISHNA REDDY HELP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 12:21 PM IST

thumbnail
బాధితుడికి అండగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి- అధికారులకు ఆదేశాలతో పింఛన్ (ETV Bharat)

Nallamilli Ramakrishna Reddy Helped a Victim to Get His Pension : ఎన్నికల ఫలితాలు వెలువడి విజయం సాధించి ఒక్కరోజు గడవక ముందే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే విజేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓ బాధితుడికి అండగా నిలిచారు. కొత్తూరుకు చెందిన సుబ్బారెడ్డి టీడీపీకి మద్దతు తెలపడంతో పింఛను రాకుండా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడికి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని నల్లమిల్లి అధికారులను కోరారు. 7 నెలలగా మనో వేదనకు గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల మాటలు విని పింఛను బదిలీ చేసిన అధికారికి తగిన శిక్ష పడుతుందన్నారు.  

అనపర్తి శాసనసభ నియోజకవర్గం విషయంలో తొలుత పీటముడి పడింది. చివరికి టీడీపీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫునే పోటీ చేశారు. అయితే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడాల నల్లమిల్లి ప్రజాసేవలో విస్తృతంగా పాల్గొనేవారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.