అన్యాయాలకు, భూలావాదేవీలకు కేరాఫ్ అడ్రస్ శారదా పీఠాధిపతి స్వరూపానంద: ముర్తి యాదవ్ - Murthy Yadav on Sharada Peetam - MURTHY YADAV ON SHARADA PEETAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 20, 2024, 10:34 PM IST
Murthy Yadav Allegations on Sharada Peetam President Swaroopananda: శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఓ నకిలీ స్వామి అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. అన్యాయాలకు, భూలావాదేవీలకు స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని ధ్వజమెత్తారు. స్వామిజీకి ప్రాణహాని లేనప్పుడు జగన్ ప్రభుత్వం ప్రత్యేక భద్రత ఎందుకు కల్పించిందని నిలదీశారు. స్వరూపానంద అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేయాలని మూర్తియాదవ్ కోరారు. ఒక పక్క సిటీలో పోలీస్ సిబ్బంది కొరత ఉంటె, మరో వైపు శారద పీఠం వద్ద 10మంది పహారా కాస్తూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనికి పోలీసు శాఖకు నెలకు 12 లక్షలు పైగా ఖర్చు అవుతోందని అన్నారు. శారదాపీఠం వైసీపీకి రెండో పవర్ హౌస్ పాత్రను పోషిస్తోంది విమర్శించారు. ఇక రాజకీయంగా నామినేటెడ్ పదవులు సమయంలో నేరుగా స్వామిజి చక్రం తిప్పారని చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖలో ఏ నిర్ణయమైనా స్వామిజీకి తెలిపి అనుమతి తీసుకుని జరగాలనే స్థితి కల్పించారని అన్నారు.