'అన్న క్యాంటీన్ల నిర్వహణకు సాయం చేయండి' - కృష్ణా చివుకులను కోరిన ఎంపీ కలిశెట్టి - MP Kalishetty MET KRISHNA CHIVUKULA - MP KALISHETTY MET KRISHNA CHIVUKULA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 9:58 AM IST
MP Kalishetty Appalanaidu Met Krishna Chivukula: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని అమెరికాలో స్థిరపడ్డ బాపట్ల నివాసి కృష్ణా చివుకులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ అప్పలనాయుడు కృష్ణా చివుకులను చెన్నైలో కలిశారు. ''ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి'' పేరిట ఈనాడు- ఈటీవీలో వచ్చిన కృష్ణా చివుకుల ఇంటర్వ్యూ చూసి ఆయన గురించి తెలుసుకున్నట్లు ఎంపీ కలిశెట్టి తెలిపారు.
దీంతో వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కుటుంబ సమేతంగా చెన్నై వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలో, రాజధాని అమరావతిలోనూ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన గురించి కృష్ణా చివుకులతో మాట్లాడారు. తాను చదువుకున్న మద్రాస్ ట్రిపుల్ ఐటీకి 228 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడంపై కృష్ణా చివుకూరును ఎంపీ అప్పలనాయుడు అభినందించారు. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు సాయం అందజేయాలని కృష్ణా చివుకులను ఎంపీ అప్పలనాయుడు కోరారు.