వరదలో కొట్టుకుపోయిన వాహనాలు - బయటకు తీసేందుకు భారీగా డబ్బులు డిమాండ్​ - MONEY DEMAND AT ITHAVARAM - MONEY DEMAND AT ITHAVARAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 4:00 PM IST

Money Demand From Owners for Retrieving Vehicles at Ithavaram : ఎన్టీఆర్​ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను అతి కష్టం మీద బయటకు తీసున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముందుకు కదలక వెనకకు వెళ్లక చాలా మంది వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 12 కార్లు, 6 బైక్​లు, ఆటో వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో వాహనాలు బయటపడ్డాయి. 

బురదలో చిక్కుకున్న వాహనాలను జేసీబీల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు. ట్రాక్టర్లకు తాళ్లు కట్టి బురదలో కూరుకున్న వాహనాలను బయటకు లాగుతున్నారు. వాహనాలను బయటకు తెచ్చుకునేందుకు యజమానులు సొంత ఖర్చులు పెట్టుకోవలసి వస్తోంది. ఒక్కో వాహనాన్ని బయటకు తెచ్చేందుకు జేసీబీ వాహనాదారులు రూ. 15 వేలు నుంచి 20 వేలు డిమాండ్ చేస్తున్నారని వాహన యజమానులు చెబుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో సోమవారం రాత్రి నుంచి ఐతవరం వద్ద రాకపోకలకు అనుమతించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.