విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్సార్సీపీ తొత్తుగా పని చేస్తున్నారు: ఎమ్మెల్యే వెలగపూడి
🎬 Watch Now: Feature Video
MLA Velagapudi on Visakha Collector: విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్సార్సీపీ తొత్తుగా పని చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. కలెక్టర్ మల్లికార్జునను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దసపల్లా, హయగ్రీవ భూములు అధికార పార్టీ నేతల పరమయ్యాయని, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వీఎమ్ఆర్డీఏ(Visakhapatnam Metropolitan Region Development Authority) మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందని అన్నారు. ఒకే బూత్‌లో డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఎంట్రీ చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయారు.
"విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైఎస్సార్సీపీ తొత్తుగా పని చేస్తున్నారు. ఆ కారణంగా కలెక్టర్ మల్లికార్జునను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. ఓటరు జాబితాలో తప్పుల గురించి కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం శూన్యం. ఒకే ఓటరుకార్డు నంబర్ మీద వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఓట్లు ఉన్నాయి." - వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే