'నేనే వస్తా - మీ అంతు తేలుస్తా' - మహిళా కౌన్సిలర్‌కు ఎమ్మెల్యే రాచమల్లు బెదిరింపులు - కౌన్సిలర్‌ను బెదిరించిన ఎమ్మెల్యే
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-02-2024/640-480-20793837-thumbnail-16x9-mla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 11:57 AM IST
MLA Rachamallu Sivaprasad Warns to : తెలుగుదేశం పార్టీలోకి మారేందుకు సిద్ధమైన ఓ మహిళా కౌన్సిలర్‌తో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే వైసీపీ కౌన్సిలర్‌గా పని చేస్తున్న ఆమె టీడీపీలో చేరేందుకు సిద్ధమవ్వడంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులోని మూడో వార్డుకు వెళ్లారు. స్థానిక కౌన్సిలర్ ఇంటికి వెళ్లి ప్రచారానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
గతంలో మేము మీకు ఎంతో సాయం చేశాం, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తిరిగి పని చేయలేమంటూ కౌన్సిలర్ సమాధానం ఇచ్చారు. దీంతో అందరూ ఉండటంతో ఏమీ చేయలేక ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే మాట్లాడేది మహిళతో అని చూడకుండా కౌన్సిలర్‌పై పరుష పదజాలంతో అందరిముందూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు మాటలను సెల్ఫోన్లో రికార్డు చేసిన కౌన్సిలర్ భర్త సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అంశం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.