బాలిక అనుమానాస్పద మృతి - ప్రమాదమా లేక చంపేశారా? - MISSING GIRL SUSPECT DEATH - MISSING GIRL SUSPECT DEATH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2024, 12:04 PM IST
Missing Girl Suspect Death in Penamaluru : కనిపించకుండా పోయిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అనేక అనుమానాలకు దారి తీస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం మంగళవారం బాలిక కనిపించకుండాపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానూరు గ్రామానికి చెందిన ఆరేపల్లి వాగ్దేవి (8) కనిపించడం లేదని తండ్రి నాగరాజు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన పెనమలూరు పోలీస్ సిబ్బంది ప్రత్యేక బలగాలని రంగంలోకి దింపి సీఐ రామారావు పర్యవేక్షించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బుధవారం తెల్లవారుజామున బాలిక మృతదేహంగా కనిపించింది. ఆరేపల్లి వాగ్దేవి ఇంటి వెనక ఉన్న చెరువులో మృతదేహంగా ప్రత్యక్షమైంది. బాలికను ఎవరైనా చెరువులో పడేశారా? లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయిందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పంచనామా నిర్వహించి శవపరీక్ష కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.