చవితి వేడుకల్లో యువకుల అనుచిత ప్రవర్తనతో గ్రామాల మధ్య ఘర్షణ - Two villeges fighting
🎬 Watch Now: Feature Video
Misbehavior Youths Dispute Between Two Villages in Tirupathi District : యువకుల అనుచిత ప్రవర్తన రెండు గ్రామాల మధ్య వివాదంగా మారిన సంఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. కేవీబీపురం మండలంలో రాగిగుంట, పెరిందేశం గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెరిందేశం గ్రామానికి చెందిన యువకులు రాగిగుంటకు వచ్చి అక్కడి స్థానికులను కొట్టడం, ద్వి చక్ర వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారి తీరును నిరసిస్తూ రాగిగుంట గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి - పిచ్చాటూరు రహదారిపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా నిప్పు వేసి నిరసన తెలిపారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా, పెరిందేశం గ్రామ యువకులు రాగిగుంట గ్రామంలో అనుచితంగా ప్రవర్తించారని అక్కడి స్థానికులు తెలిపారు. యువకుల అనుచిత ప్రవర్తనను ప్రశ్నించడంతో పెరిందేశం నుంచి భారీగా జనాలు వచ్చి తమ గ్రామంలో విధ్వంసం సృష్టించారని వెల్లడించారు. ఇవాళ ఉదయం మరోసారి దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాగిగుంట గ్రామస్థులు డిమాండ్ చేశారు.