వైసీపీ హయాంలో గుడి, బడి దేన్నీ వదల్లేదు : మంత్రి వాసంశెట్టి - Minister Vasamsetti Fires on YSRCP - MINISTER VASAMSETTI FIRES ON YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 9:12 PM IST
Minister Vasamsetti Fires on YSRCP : వైఎస్సార్సీపీ హయాంలో గుడి, బడి దేన్నీ వదలకుండా దోచేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. గతంలో మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన వేణు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇష్టారాజ్యంగా దండుకున్నారని మండిపడ్డారు. దాతల సొమ్ముతో రథాన్ని తయారు చేసినప్పుడు మాజీ మంత్రి పేరు శిలాఫలకంపై ఎలా వేశారని ఈవోను ఆయన ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో వాసంశెట్టి ప్రజాదర్బార్ నిర్వహించారు.
Vasamsetti Prajadarbar in Draksharamam : అవినీతి, అక్రమాలను సహించే ప్రసక్తే లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఈవో తారకేశ్వరరావు, మరో ఇద్దరు ఉద్యోగులపై భక్తులు అవినీతి ఆరోపణలు చేశారు. ఆలయానికి పిలిచే టెండర్లు, అదేవిధంగా ప్రాంగణంలోని దుకాణాల యాజమానుల నుంచి వారు భారీ మొత్తంలో వసూలు చేసి స్వాహా చేశారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన ఆయన అన్నింటిపైనా విజిలెన్స్ విచారణకు ఆదేశించామని, విచారణ తర్వాత అందరి లెక్కలు తేలుస్తామని వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు.