'గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదు'- ఆర్టీసీ కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి - Hundred Bed Hospital in Salur - HUNDRED BED HOSPITAL IN SALUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 1:08 PM IST
Minister Sandhya Rani on Hundred Bed Hospital in Salur : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వంద పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. సాలూరులో పర్యటించిన మంత్రి రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు విశ్రాంత గదిని ప్రారంభించారు. తర్వాత ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, డాక్టర్ అంటే వైద్యులు మాత్రమే కాదు దేవుళ్లతో సమానమని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం సక్రమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇకపై డోలీ మోతలు ఉండకూడదని ఏఎన్ఎం, ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. వైద్యుల మధ్య విభేదాల కారణంగా రోడ్డెక్కొద్దని సూచించారు. మలేరియా, కుక్క పాముకాటుతో పాటు అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో ఉన్నాయని అన్నారు. ఏఎన్ఎం, అంగన్వాడీలు గిరిజన శిఖర, మారుమూల గ్రామాల్లో ఏడు నెలలు నిండిన గిరిజన గర్భిణులను వసతి గృహంలో చేర్చాలన్నారు. ఫీడర్ అంబులెన్సులు సేవలు మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో రెండు గ్రామాలకు వేల ప్రభుత్వం రోడ్లు వేయనుందని, వాటిలో ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సాలూరు ఆర్టీసీ డిపోలో కొత్త బస్సులను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. డిపో ఆవరణలో మొక్కలు నాటారు. రాష్ట్రానికి 4000 కొత్త బస్సులు వచ్చాయని, అందులో సాలూరు డిపోకు మూడు కొత్త బస్సులు రావడం సంతోషకరమని అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్టార్ట్ చేసి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని తెలిపారు.