ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలకు పచ్చజెండా - Irrigation Societies Elections
🎬 Watch Now: Feature Video
Minister Nimmala Ramanaidu About Irrigation Societies Elections : వైఎస్సార్సీపీ ధ్వంసం చేసిన సాగునీటిపారుదల వ్యవస్థకు పునరుజ్జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. సాగునీటి సంఘాల ఎన్నికలకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సాగు నీటి సంఘాల ప్రాతినిథ్యంతో ప్రతీ చివరి ఎకరాకూ నీరు అందేలా చూస్తామని తెలిపారు.
ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధమన్నారు. నవంబర్ మొదటి వారంలోగా సాగు నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించారు. నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడికతీత, మరమ్మతులు, గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహణ, పర్యవేక్షణ లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు. నేడు రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా సాగు నీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.