LIVE: మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - Minister Nadendla Manohar - MINISTER NADENDLA MANOHAR
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 1:07 PM IST
|Updated : Jul 4, 2024, 1:27 PM IST
Minister Nadendla Manohar Press Conference Live: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్ట్‌ని అడ్డాగా మార్చుకుని ఆహార మాఫియా నడిపించారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శాఖలన్నీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం కోసమే పని చేశాయని మంత్రి ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో దీనిపై ఇటీవలే ఆయన సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖలో వ్యవస్థాపరమైన లోపాలను అధికారులతో చర్చించారు. పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మనోహర్ అన్నారు. రేషన్‌లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలుతున్నందున పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని నాదెండ్ల చెప్పారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Jul 4, 2024, 1:27 PM IST