వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు- జగన్ అరాచక పాలన నచ్చకే పార్టీ వీడుతున్నట్లు వెల్లడి
🎬 Watch Now: Feature Video
Massive Inflows From YCP Change to TDP: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం, గణపవరానికి చెందిన 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వైసీపీ ప్రభుత్వా నికి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని గిద్దలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం రాత్రి గిద్దలూరు నగర పంచాయతీ 18వ వార్డులోని నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలో 100 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీ కండువా కప్పుకున్నాయి. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలస వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీను వీడి తెలుగుదేశం కండువా కప్పుకున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన నచ్చకే వైసీపీను వీడీ తెలుగుదేశంలో చేరుతున్నామని వారంతా తెలిపారు.