ఏఒబీలో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం- పోలీసుల‌ను ల‌క్ష్యంగా అమ‌ర్చిన బాంబులు - Maoist Dump Seized - MAOIST DUMP SEIZED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 4:42 PM IST

Maoist Dump Seized at Andhra Odisha Border: ఆంధ్రా- ఒడిశా స‌రిహ‌ద్దుల్లో (AOB) మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను ఈరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నది స‌మీపంలో టేకుగూడా ప్రధాన ర‌హ‌దారికి కూత‌వేటు దూరంలో మావోయిస్టులు డంప్ బ‌య‌ట‌ప‌డింది. మావోయిస్టుల కార్యక‌లాపాలు నిరోధించేందుకు బీఎస్ఎఫ్ (Border Security Force) బ‌ల‌గాలు గాలింపులు చేప‌ట్టారు.

Police Seized Dumps In Bejjangiwada Forest Area: బెజ్జంగివాడ అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న సొరంగాలు నుంచి డంప్‌లు స్వాధీనం ప‌రుచుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల‌ను ల‌క్ష్యంగా చేసి అమ‌ర్చిన ఐఈడీ (IED) బాంబుల‌ను క‌నుగొన్న భ‌ద్రతా బ‌ల‌గాలు నిర్వీర్యం చేశారు. ఈ డంప్‌లో 7 ఎస్​బీఎమ్​ఎల్ (SBML) తుపాకులు, 2 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) బాంబులు, 36 హ్యాండ్ గ్రైనేడ్లతో పాటు ఎల్​పీజీ (Liquid Petroleum Gas) సిలిండర్, ఎలక్ట్రికల్ వైర్లు సుమారు 500 విడిభాగాలు స్వాధీన పరుచుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.